ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
బోథ్, జూలై 13 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో(Democratic system) ఓటు అనేది వజ్రాయుధం వంటిదని ఎస్ ఐ ఆర్(Special Intensive Revision) కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాపాడుకోవాలని బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కోరారు.సోమవారం మండలంలోని పోచ్చర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హెల్ప్ డేస్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొనాలని మాట్లాడారు.
అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకోవడం కోసం దరఖాస్తులు బి ఎల్ ఓ లకు అందించాలన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ భోజన్న మాజీ సర్పంచ్ బూరుగుల మల్లేష్ డైరెక్టర్ గడిచిందా అనిత గంగన్న పొన్నాల సురేందర్ రెడ్డి ఉప సర్పంచ్ గడ్డ మనోహర్ బి అనిలు గుంజల ప్రభాకర్ నడికుంట ప్రవీణ్ బూరుగుల సందీప్ కుమార్ గంగారెడ్డి కుంట జనార్దన్ రెడ్డి తిరుపతి రెడ్డి కమల్ తదితరులు పాల్గొన్నారు






