'సీఎం రేవంత్ రెడ్డికి రక్తదాహం' పేరుతో రక్తదాన శిబిరం
13-07-2026 12:35 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్(Telangana Bhavan)లో 'సీఎం రేవంత్ రెడ్డికి రక్తదాహం' కార్యక్రమం నిర్వహించారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్, బీఆర్ఎస్ వై ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద సోమవారం భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రక్తదాహం తీర్చేందుకు విద్యార్థి విభాగం రక్తదానం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు. దానం చేసిన రక్తాన్ని సీఎం నివాసానికి తీసుకుపోయి ఇస్తామని బాల్క సుమన్ తెలిపారు.






