అభివృద్ధి ఎజెండా.. సంక్షేమమే తమ లక్ష్యం
మంత్రులకు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు రహదారుల విస్తరణ, మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేయడానికి జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahabubnagar MLA Yennam Srinivas Reddy), కలెక్టర్ ఖుష్బూ గుప్తాలు మంత్రులను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మంత్రుల పర్యటనతో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరుతుందని పేర్కొన్నారు. మంత్రులు స్పందిస్తూ, జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, ముఖ్యంగా రహదారులు మరియు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి. జానకి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, సాయిబాబా ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.






