గుట్టును మింగేస్తున్న మట్టి మాఫియా
- గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రుల్లో మట్టి తవ్వకాలు
- చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థుల డిమాండ్
ధర్మపురి, మే15(విజయక్రాంతి):జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం స్తంభంపల్లి-పాశిగామ గ్రామాల మధ్య ఉన్న ప్రభుత్వ గుట్టను మట్టి మాఫియా మింగేస్తోంది. ప్రతిరోజు అర్ధరాత్రిలో ప్రదుల సంఖ్యల ట్రాక్టర్లతో జెసిబి యజమానులు ప్రభుత్వ గుట్టను తవ్వి మట్టిని దోచుకెళ్తు లక్షల్లో ప్రభుత్వ ఆధాయానికి గండి కొడుతున్న సంబంధిత అధికారులు ఏమాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే ప్రభుత్వ గుట్టపై గతంలో పాత్రికేయుల ఇళ్ల స్థలాలకు మరియు బౌద్ధ స్తూపం ఏర్పాటు కోసం అధికారులు స్థలపరిశీల సైతం చేశారు. అయితే పాశిగామా గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అవసరమైనందున పాత్రికేయులకు పాశిగామ గ్రామంలో ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని ఆ గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు.
దానితో పాత్రికేయుల ఇళ్ల స్థలాల అంశం అంతటితో కనుమరుగయ్యింది. ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా ఏ ప్రభుత్వ గుట్టపై అయితే స్థల పరిశీల జరిగిందో అదే గుట్టను తవ్వుతూ అక్రమ మట్టి రవాణా చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు. గ్రామస్తుల నుండి పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు వెళ్లిన ఏ మాత్రం పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గుట్టను ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా నిత్యం తరలించుకు వెళ్లడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి పడుతున్న సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడాన్ని గ్రామస్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ మట్టి రవాణా అడ్డుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిపై ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు : మైనింగ్ ఏడీ జైసింగ్
ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అక్రమ మట్టి తవ్వకాలు జరిపితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. మట్టి అవసరం ఉంటే ప్రభుత్వానికి చలానా కట్టి అనుమతులు తీసుకోవాలి. అంతేకానీ ఎవరి ఇష్టానుసారం వారు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం నేరంగా పరిగణించబడుతుంది.స్తంభంపల్లి _పాశిగామ అక్రమ మట్టి రవాణా విషయము కలెక్టర్ దృష్టిలో ఉంది. అక్రమ మట్టి రవాణా దారులపై చర్యలు తీసుకోవాలనీ ఇప్పటికే మాకు స్పష్టమైన ఆదేశాలు అందినాయి.రెవెన్యూ, పోలీస్ శాఖను అనుసంధానం చేసుకొని సంబంధిత అక్రమ మట్టి రవాణా చేసే వారిని పట్టుకుని, వాహనాలు సీజ్ చేసి తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.






