18 June, 2026 | 4:13 AM

ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి

18-06-2026 01:35 AM

పాఠ్యపుస్తకాల ధరలను నియంత్రించాలి

జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం

కామారెడ్డి, జూన్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్,టీజేఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, టీజేఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ లు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు విద్య హక్కు చట్టాన్ని ఉల్లంఘించి పాఠ్యపుస్తకాలను అమ్మడం జరుగుతుందని, మార్కెట్ దొరికే ధర కంటే ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి దోపిడీకి పాల్పడడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకురావడం జరిగింది నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.