27 May, 2026 | 5:42 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

సెంచరీ దిశగా రూపాయి!

21-05-2026 12:00 AM

భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతూనే ఉన్నది. బుధవారం నాడు డాలర్‌తో పోలిస్తే 33 పైసలు తగ్గిన రూపాయి విలువ 96.86కి చేరుకోవడం ఆందోళనకరం. గత కొంతకాలంగా అడ్డూఅదుపూ లేకుండా పతనమవుతున్న రూపాయి రాబోయే రోజుల్లో సెంచరీ కొట్టినా ఆశ్యర్యపోనక్కర్లేదు. ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి విలువ సుమారు 5.7 శాతం పడిపోవడం శోచనీ యం. పశ్చిమాసియా ఉద్రికత్తలతో ముడిచమురు ధరలు భారీగా పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు పెరుగుతుండటం వంటి అంశాలు రూపాయి బలహీనపడటానికి కారణాలుగా పైకి కనిపిస్తున్నది.

కానీ, ఇరాన్ పోరు ప్రారంభం కాకముందే రూపాయి పతనం ప్రారంభమైందన్నది కాదనలేని వాస్తవం. భారత్ ప్రధానంగా దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశం. ముఖ్యంగా ముడిచమురు, ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పసిడి, వంటనూనె, ఇతర నిత్యావసరాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తేనే భారత్‌లో బతుకుబండి ముందుకుసాగుతుంది. ఈ కొనుగోళ్లకు డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోర్ముజ్ మూసివేత కారణంగా ఒకవైపు ఎగుమతులు నిలిచిపోవడం, చమురు దిగుమతులు పెరగడంతో భారత దిగుమతుల బిల్లు ఎక్కువై విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి.

ఈ సంక్షోభ సమయంలో చాలామంది డాలర్‌ను సురక్షిత పెట్టు బడిగా భావిస్తుండటంతో అమెరికా కరెన్సీ మరింతగా బలపడుతున్నది. అయితే, ప్రపంచ పరిణామాలే కాకుండా భారత్‌లో నానాటికీ నిరుద్యోగం పెరుగుతుండటం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం లాంటి అంతర్గత సమస్యలు రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రూపాయి విలువ పతనం చివరికి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది.

రూపాయి బలపడాలం టే భారత్ ఎగుమతులను పెంచడం, దిగుమతులను తగ్గించుకోవడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతులను తగ్గించేందుకు పునరుత్పాదక ఇంధనాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ‘మేక్ ఇన్ ఇండియా’, కొన్ని దేశాలకు రూపాయి లలో చెల్లింపులు చేయడం వంటి చర్యలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇవ్వవచ్చు. ఈ సంక్షోభ పరిస్థితులను చూస్తుంటే సమీప భవిష్యత్తులో రూపాయి మరిం త బలహీనపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో భార త్ ఈ విపత్కర పరిస్థితిని ఎలా అధిగమిస్తుందో చూడాలి.