14 May, 2026 | 4:34 AM

పాఠశాలల అభివృద్ధిలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం

14-05-2026 02:29 AM

అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల టౌన్, మే 13 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమైందని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పి చంద్రయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని తాండ్రపాపారాయుడు ఫంక్షన్ హాల్ లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాశాఖ వారోత్సవాలలో బుధ వా రం మంచిర్యాల నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, సర్పంచులకు నిర్వహిం చిన ఒక్కరోజు వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ దర్ని మధూకర్ తో కలిసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చల్ల రమ్య, డీఈఒ ఎస్ యాదయ్య, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు విజయలక్ష్మి, సత్తయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.