15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

రామమ్మపేట గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం..

08-12-2025 12:14 AM

వనపర్తి, డిసెంబర్ 7 ( విజయక్రాంతి ) :  గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త చిన్న రాయుడు రామమ్మపేట గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఏకగ్రీవ సర్పంచి పద్మమ్మను శాలువాలతో సన్మానించి అభినందించారు.

రామమ్మపేట గ్రామం ఏకగ్రీవమైనందున తన ఎస్డిఎఫ్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలను ఇస్తానని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రామమ్మపేట గ్రామ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, మధు, నాగేంద్రం, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, సత్య రెడ్డి, భాస్కర్ తోపాటు పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.