7 April, 2026 | 4:52 AM

పబ్బం గడుపుకోవడానికే బంద్

07-04-2026 03:07 AM
  1. స్వార్థం కోసం ఉద్యమకారులను వాడుకుంటున్న ప్రతాప్‌రెడ్డి 

కాంగ్రెస్ గజ్వేల్‌కు రూ.౧౦౦ కోట్ల నిధులు ఇచ్చింది 

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వెల్లడి

గజ్వేల్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ బంద్ నిర్వహించారని టీపీసీసీ రాష్ట్ర నాయకులు నాయిని యాదగిరి, ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్దార్‌ఖాన్ ఆరోపిం చారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో వారు విలేకరులతో మాట్లా డారు. గజ్వేల్ మార్కెట్‌లో చిరువ్యాపారులు రోజువారి సంపాదనతో జీవనాన్ని వెళ్లదీస్తుంటారని, ఇలాంటి అవసరం లేకున్నా గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చి వారి పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఉద్యమకారులను,

బీఆర్‌ఎస్ కార్యకర్తలను వాడు కొని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతాప్ రెడ్డి గత చరిత్ర అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా గజ్వేల్ కు ఇవ్వలేదని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీకి రూ.17 కోట్లు, తూప్రాన్ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రూ.100 కోట్లకు పైగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కోరగా నిధులు మంజూరు చేశారన్నారు. ప్రజలకు నిజాలు చెప్పాలని, 

అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేయవద్దని హితవు పలికారు. గతంలోనే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని, హైదరాబాద్ వరకు ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు.ఎమ్మెల్యే రాని క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టడానికి వెళితే, దాడి చేశామని కాంగ్రెస్ నాయకులపై అబద్ధపు ప్రచా రాలు చేయడంతో పాటు బంద్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ప్రతాప్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా సహకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సమావేశం లో కౌన్సిలర్లు రమేష్, నాయిని సత్యలక్ష్మి యాదగిరి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ షహనాజ్ సమీర్ పాల్గొన్నారు.