28 February, 2026 | 9:34 AM

సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో కీలకం

28-02-2026 01:41 AM

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జర్నలిస్టు సమస్యలకు కృషి

మంథని ప్రజలకు అవినీతిరహిత పాలన అందిస్తాం

మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

మంథని, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో ప్రా ధాన్యత కలిగినదని పాత్రికేయులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మం థని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహెందర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం మంథని డివిజన్ మీడి యా ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ క్లబ్ లో అందరు సీనియర్ పాత్రికేయులు ఉన్నారని సమస్యలపై మాకు వివరిస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

అలాగే జర్నలిస్టుల సమస్యలు మా కు తెలుసు అని పాత్రికేయులకు ఎలాంటి జీతభత్యాలు లేకున్నా ప్రజా సమస్యలపై ని రంతరం కృషి చేస్తున్నారన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులైన జర్నలిస్టులకు కూడా వర్తించేలా ప్రయత్నిస్తారని అన్నారు. మా పరంగా కూడా డివిజన్ ప్రెస్ క్లబ్ కు పూర్తిగా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

గతంలో నేను స ర్పంచ్ గా ఉన్న సమయంలో మంత్రిగా ఉ న్న శ్రీధర్ బాబు జర్నలిస్టులకు ఇంటి స్థ లాలు మంజూరు చేశారని మున్సిపల్ చైర్మ న్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రి సహకారంతో అర్హులైన జర్నలిస్టులకు స్థలంతో పాటు ఇండ్ల మంజూ రుకు మా వంతు కృషి చేస్తామని అన్నారు. మంథని ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సంఘాల నాయకులు బూడిద గణేష్, మేడగోని రాజమౌళి గౌడ్, బూడిద తిరుపతి, బెజ్జంకి డిగంబర్, ఇరుగురాల ప్రసాద్ తో పాటు డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొడారి మల్లేష్ యాదవ్, సహాయ కార్యదర్శులు మాదరబోయిన కిషన్, మాటేటి కుమార్, ప్రెస్ క్లబ్ మండల కన్వీనర్ మహావాది సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు బొల్లవరం విజయనంద రావు, కార్యవర్గ సభ్యులు వెల్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విజయానందరావు, పాత్రికేయులు రామడుగు సాయి శ్రీనివాస్, మాదేశి శ్రావణ్, ఏ గోవులకు సంతోష్ కుమార్ గౌడ్, అనుముల వీరస్వామి, మంథని లక్ష్మణ్, చీరాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.