బ్లాక్ బస్టర్ :తమిళ జన నాయకుడు విజయ్
కింగ్ మేకర్ కాదు.. కింగే!
పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే తమిళ నటుడు విజయ్ ఘన విజయాన్ని సాధించారు. డీఎంకే, అన్నాడీఎంకే రాజకీయాలకు తమిళనాడు ప్రజలు చరమగీతం పాడుతూ తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు అనూహ్యంగా పట్టం కట్టారు. రాష్ట్రంలోని జెన్ జీ, మహిళలు నిశ్శబ్ధంగా విజయ్ పార్టీకి ఓటేశారు. రాష్ట్ర ప్రజలకు ఉచితాలే కాకుండా.. డిజిటల్ పారదర్శకత, విద్యా వ్యవస్థ ఆధునీకరణపై యువత విజయ్ హామీలకు ఆకర్షితులయ్యారు. విజయ్ చరిష్మా కేంద్రకంగా.. సోషల్ మీడియాలో యువత పెద్దఎత్తున సాగించిన ప్రచారం టీవీకేకు అపూర్వ విజయాన్ని అం దించింది. మ్యాజిక్ ఫిగర్‌కు ౧౧ సీట్లు తక్కువగా విజయ్ విజయ పరంపర సాగింది. డీఎంకేకు ఎదురుదెబ్బ తగలడమే కాదు.. తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. చెపాక్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గెలుపొందారు.
తమిళగడ్డపై విజయ్ గర్జన
- ౨౩౪ అసెంబ్లీ స్థానాల్లో టీవీకే ౧౦౭ స్థానాలు కైవసం
- మ్యాజిక్ ఫిగర్ ౧౧౮ కాగా, పగ్గాలు చేపట్టేందుకు మరికొన్ని సీట్లు అవసరం
- మద్దతు కూడగట్టే పనిలో టీవీకే అధినేత విజయ్
- డీలా పడిన డీఎంకే.. ౬౦ స్థానాలు కైవసం
- జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో ఒక స్థానానికి పరిమితం
చెన్నై, మే ౪: తమిళనాడు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ౧౯౬౭లో ద్రవిడ ఉద్యమ వెల్లువ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏడీఎంకే మధ్యే అధికారం మారుతూ వచ్చింది. కానీ, ఈ రెండు పార్టీలను పక్కనపెట్టి ఇన్నాళ్టికి అక్కడి ప్రజలు టీవీకే అనే కొత్త పార్టీకి జైకొట్టారు. టీవీకే అధినేత విజయ్‌కి 107 స్థానాల్లో కట్టబెట్టి ఘన విజయం అందించారు. దీంతో ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఫలితాల్లో టీవీకే ఒంటరిగానే 107 స్థానాలను కైవసం చేసుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ అల్లంత దూరంలోనే ఉంది. ప్రస్తుతం విజయ్ మ్యాజిక్ ఫిగర్ అధిగమించేందుకు అవసరమైన మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే తమిళనాడులో సరికొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల అధికారాన్ని బద్దలు కొట్టినట్లవుతుంది.
డీలా పడిన డమాల్
అధికార డీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ కేవలం 60 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరో ప్రధాన పార్టీ అన్నాడీఎంకే 47 స్థానాలను గెలుచుకుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ఐదు స్థానాలకు.. భాజపా కేవలం ఒక స్థానానికి పరిమితమయ్యాయి. పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 4 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ముస్లిం లీగ్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు తలా రెండు స్థానాలను దక్కించుకున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరిగాయి. రాష్ర్టంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా డీఎంకే కూటమి ఘనవిజయం సాధించింది. డీఎంకే పార్టీ సొంతంగా 133 సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది.
కొలత్తూరులో స్టాలిన్ పరాజయం
టీవీకే అభ్యర్థి బాబు చేతిలో ఓటమి
చెన్నై, మే ౪: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఆయన ఓటమి పాలయ్యారు. 2011 నుంచి వరుసగా వడుసార్లు ఇక్కడ గెలిచిన స్టాలిన్ ఈసారి ఓడిపోవడం చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో సీఎం పదవిలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాలుగో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ పరాజయం పాలయ్యారు. ఒకప్పుడు స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడైన బాబు.. ఇటీవల టీవీకేలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. గతంలో బాబు ఉత్తర చెన్నై డీఎంకే జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ౨006లో పురసవాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎంకే స్టాలిన్ (తమిళనాడు సీఎం డీఎంకే)
నియోజకవర్గం: కోలతూర్ 74,202 (సాధించిన ఓట్లు)







