28 February, 2026 | 11:16 AM

నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు పరిహారం కోసం రూ. 20 కోట్లు మంజూరు చేయాలి

28-02-2026 01:42 AM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు పరిహారం కోసం రూ.ల 20 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. ఈ మేరకు  శుక్రవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం, పాలకులు నారాయణపూర్ ముంపు బాధితులను పట్టించుకోలేదని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వాసితులకు పరిహారం చెల్లించడానికి రూ. 23.50 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మరో రూ. 20 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. కాగా పరిహారం మంజూరుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం కృతజ్ఞతలు తెలిపారు.