27 July, 2026 | 7:30 PM

Breaking News

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •   ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చరిత్రాత్మకం   •   మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి   •   ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి   •   దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •  

సకాలంలో మక్కల కొనుగోలు పూర్తి చేయాలి

04-06-2026 12:46 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ 

సదాశివనగర్, జూన్ 3 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరిం చాలని,మక్కల కొనుగోలు పక్రియ మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ అన్నారు. బుధవారం సదాశివ నగర్ మండలంలోని పద్మజివాడి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

రైతుల సౌకర్యాలు, తూకం పక్రియ, నిల్వ ఏర్పాట్లు,చెల్లింపుల విధానం పరిశీలించి తగు సూచనలు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి, చెల్లింపులు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ ఐ సంతోష్, ఏవో ప్రజాప్రతి, విండో చెర్మన్ గంగాధర్, పద్మావతి వాడి సర్పంచ్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పాల్గొన్నారు.