2 May, 2026 | 2:11 AM

ప్రధాని సభను జయప్రదం చేయాలి

02-05-2026 12:54 AM
  1. ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే విజయం 
  2. కార్మికుల భాగస్వామ్యంతో వికసిత్ భారత్ 
  3. దేశ అభివృద్ధిలో వారి పాత్ర ప్రధానం
  4. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్, మే 1 (విజయక్రాంతి): వికసిత్ భారత్‌లో కార్మికుల భాగస్వామ్యం కీలకమని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడవ సారి ప్రధానిగా చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు నరేంద్రమోదీ వస్తున్నారని, అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని చె ప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని, సభ లో ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్ని కల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

తర్వాత దృష్టి తెలంగాణ అని, ప్రధాని రాకతో సంకేతం ఇస్తున్నారని చెప్పారు. పదేళ్లు పాలించి న బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసి.. ఆశలు అడియాశలు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించా రు. మహిళలకు ఇచ్చిన హామీలు అన్ని తుంగలో కాం గ్రెస్ తొక్కిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుంది కాబ ట్టే.. పదేపదే ప్రజలు అధికారం కట్టబెడుతున్నారని చెప్పా రు. తెలంగాణలో 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ  శంకుస్థాపన చేయబోతు న్నారన్నారు.

జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని భావించి ఏ రా ష్ట్రానికి నష్టం జరగకుండా సమన్యాయంతో 50శాతం సీట్ల పెంపు నిర్ణయం తీసుకున్నారన్నారు. దాని ని కూడా దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేస్తుందని తప్పుడు ప్రచా రం చేసిందని, ఉత్తర, దక్షిణ అనే విద్వేషాలు సృష్టించార న్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీలో పెట్టింది.. ఏమైంది.? కాంగ్రెస్‌లో విలీనం చేసిందన్నారు. కవిత పార్టీ కూడా ఏదోక పార్టీలో విలీనం చేస్తుందన్నారు. స మావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ  సభ్యులు  పద్మజ రెడ్డి, శ్రీశైలం దేవస్తానం బోర్డు సభ్యులు కట్ట సుధాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి, నాగిలి గారి రమేష్ కుమార్, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ARUNA