13 July, 2026 | 3:28 AM

మన సంప్రదాయాలు ఎంతో గొప్పవి

13-07-2026 02:42 AM

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

షాద్నగర్, జూలై 12 (విజయక్రాంతి):మన సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. నందిగామ మండలంలోని రంగాపూర్ గ్రామంలో నిర్వహించిన గొల్ల, కురుమల కులదైవాలైన మహాకాళి, బీరప్ప, కామరాతి దేవతల నూతన విగ్రహాలు, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ..

గ్రామాల్లో మహంకాళి, బీరప్ప, కామరాతి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమని గుర్తుచేశారు. ఆ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆంజనేయులు, అవినాష్, అశోక్, లింగం తదితరులు పాల్గొన్నారు.