2 May, 2026 | 2:11 AM

జూన్ 2 కల్లా జర్నలిస్టులకు శుభవార్త

02-05-2026 12:52 AM
  1. ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం
  2. 4 జర్నలిస్టుల సంఘాలు జేఏసీగా ఏర్పడాలి
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచన 
  4. జర్నలిస్టు సంఘాలతో భేటీ 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి) : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పక్రియను వేగవం తం చేసి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు శుభవార్త చెప్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల స మస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జూన్ 2వ తేదీ కల్లా సమస్యను కొలిక్కి తెస్తామని ప్రకటించారు.  సచివాల యం సమావేశ మందిరంలో 4 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రి భేటీ అయ్యారు. అంతకు ముందు జూబ్లిహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్నలిస్ట్‌ల ఇండ్ల స్థలాలపై చర్చించారు.

అంతకు ముందు నాలుగు సొసైటీల ప్రతినిధులతో తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్, సమాచార శాఖ కమిషనర్ సమాలోచనలు జరిపారు. ఇండ్ల స్థలాలపై వివిధ సొసైటీల ప్రతినిధుల అభిప్రాయం తీసుకున్నారు. రాజధాని హైదరాబాద్‌కు కొంత దూరంలో ఉన్న ప్రాంతాలు (ఫోర్త్ సిటీ) అయితే 300 గజాల స్థలం, నగరానికి దగ్గరపట్ల ఉన్న ప్రాంతాలలో 1600 చదరపు అడుగుల ఫ్లాట్ ఇచ్చే విధంగా ఏకాభి ప్రాయం వ్యక్తం అయ్యింది. ఒకే చోట పెద్ద మొత్తంలో స్థలం అందుబాటులో లేకుంటే హైదరాబాద్ శివారుల్లో నలువైపులా స్థలా లు ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలకు సంబంధిం చి సభ్యుల సంఖ్య 9కి మించకుండా సొసైటీల నిర్వాహకులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇవాళ్టి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని రూపొందించి తనకు అందించాలన్నారు. ఆ ప్రతిని తాను స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన వనరుల సమీకరణ ఉప సంఘానికి అందజే స్తానని చెప్పారు. సబ్ కమిటీ ఆమోదముద్ర వేసిన తరవాత అందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరకు వెళ్దామని, స్థలా ల కేటాయింపు ఫైలుపై ఆయనతో సంతకం చేయించి ప్రక్రియను ముగిద్దామని తెలిపారు. సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుందరెడ్డి, సీఎం సీపీఆర్వో గు ర్రం మల్సూర్ పాల్గొన్నారు.