14 July, 2026 | 4:53 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం

18-04-2026 12:54 AM
  1. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్లలోఅరైవ్.. అలైవ్ కార్యక్రమం

హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం,సీపీఆర్ ప్రథమ చికిత్స పై శిక్షణ,అవగాహన

సిరిసిల్ల క్రైం: ఏప్రిల్ 17(విజయ క్రాంతి)వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు పేర్కొన్నారు.ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ,రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల13వ తేదీ నుంచి18వ తేదీ నుంచి వారోత్సవాల సందర్భంగాఅరైవ్..

అలైవ్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్ లో జిల్లాలోని ఆర్టీసీ, విద్యాసంస్థలు, ఆటో, మున్సిపల్,ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సీపీఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ,అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్యఅతిథిగా రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్,ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు.

ఈసందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ..ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది వాహనాల డ్రైవర్లేనని తెలిపారు.ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,అలాగే విద్యార్థుల రవాణాలో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.‘