18 April, 2026 | 7:00 AM

ఎంపీ తేజస్వి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పాలి

18-04-2026 12:55 AM

మంథని,ఏప్రిల్ 17(విజయక్రాంతి) పార్లమెంటులో ఎంపి తేజస్వి సూర్య చేసిన వాక్యాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుల పోరం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి మంథని లో శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన చేసిన వాక్యాలు వెంటనే వెనుకకు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. అన్ని రకాలుగా వివక్షతకు గురి అవుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు పోరాడిన వారిని అవమానపరిచే విధంగా పార్లమెంట్ లో ఒక పార్లమెంట్ సభ్యుడు వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు.

విజ్ఞత కలిగిన వారు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి వనజారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, రాష్ట్ర కార్యదర్శి బత్తుల శంకర్, కమాన్ పూర్ మండల అధ్యక్షులు రామస్వామి, చందుపట్ల ప్రదీప్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో టియు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డిమాండ్ చేశారు.