21 May, 2026 | 4:32 AM

వారసత్వ కట్టడాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

21-05-2026 01:54 AM

ములుగు (మహబూబాబాద్), మే 20 (విజయక్రాంతి): వారసత్వ కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత అని, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటాలని, ములుగు జిల్లాను పర్యాటక రంగంలో విశిష్ట స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యాటక వారోత్సవాల నేపథ్యంలో బుధవారం ములుగు జిల్లా లో జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్ నుండి చారిత్రక ప్రాధాన్యత కలిగిన కాకతీయ కాలనాటి పురాతన శివాలయం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తో పాటు ఇతర అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బోగత జలపాతం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం, తాడ్వాయి హాట్స్, ఎటు నాగారం వన్యప్రాణి కేంద్రం, బ్లాక్ బెర్రీ హైలాండ్ వంటి వైవిధ్య ఫలితమైన పర్యాటక ప్రాంతాలతో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానాన్ని పొందిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరక్టర్ బుజ్జి, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, విద్య శాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి, బి డబ్ల్యు ఓ ప్రేమలత,డి పి ఓ వెంకయ్య, డి పి ఆర్ ఓ రఫిక్, తహసిల్దార్ విజయ భాస్కర్, ఎంపీఓ రహీమ్, జాకారం సర్పంచ్ దాసరి సమత, టూరిజం శాఖ సిబ్బంది, గైడ్స్, టూరిస్ట్ పోలీస్, తదితరులు పాల్గొన్నారు.