13 August, 2026 | 3:42 AM

బొంగుళూరు ఇందిరమ్మ కాలనీలో ‘ప్లాట్ల’ భాగోతం

13-08-2026 02:00 AM
  1. విలేకరులకు కేటాయించిన స్థలాల్లో అక్రమాలు
  2. సర్వే నంబర్ 11లో అధికారుల క్షేత్రస్థాయి విచారణ
  3. ఒకే వ్యక్తికి ఐదు బినామీ ప్లాట్లు..
  4. అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

ఇబ్రహీంపట్నం, 12 ఆగసు ్ట(విజయక్రాం తి): ఆదిభట్ల మున్సిపాలిటీ, బొంగుళూరు ఇందిరమ్మ కాలనీ (సర్వే నంబర్ 11) వేదిక గా పెద్ద ఎత్తున భూ అక్రమాలు, ప్లాట్ల గో ల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అట్టి స్థలం లో గతంలో విలేకరులు, పేదలకు కేటాయించిన ప్లాట్లలో కొందరు చ క్రం తిప్పి బినామీ పేర్లతో స్థలాలను కాజేసినట్లు వస్తున్న ఫిర్యాదులపై అధికారులు ఎ ట్టకేలకు రంగంలోకి దిగారు. స్థానికులు, గ్రా మ ప్రజలు అందించిన సమాచారం మేరకు బుధవారం ఆదిభట్ల సర్కిల్ అసిస్టెంట్ ము న్సిపల్ కమిషనర్ రమేష్ తమ సిబ్బందితో కలిసి బొంగుళూరు ఇందిరమ్మ కాలనీలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

వెలుగులోకి బినామీల దందా..

అధికారుల ప్రాథమిక విచారణలోనే వి స్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు స మాచారం. ఒకే వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి ఏకంగా ఐదు ప్లాట్లను బినామీ పేర్లతో పొందినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. భూ కేటాయింపు పత్రా లు, ప్లాట్ల ఒరిజినల్ రికార్డులు, రిజిస్ట్రేషన్ కాగితాలను అధికారులు స్వాధీనం చేసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

నిజమైన బాధితులకు అన్యాయం..

అర్హులైన విలేకరులు, స్థానిక నిరుపేదలకు దక్కాల్సిన ప్లాట్లను నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి కొందరు అక్రమార్కులు చేజిక్కించుకున్నారనే ఆరోపణలకు ఈ విచారణ బలం చేకూరుస్తోంది.  సర్వత్రా నిరస నలు ప్రభుత్వ భూములు, పేదల హక్కులు, విలేకరుల ప్లాట్ల విషయంలో దళారులు, అక్రమార్కులు పక్కా ప్రణాళికతో దందాలు నడిపారని కాలనీవాసులు మండిపడుతు న్నారు. ప్రభుత్వం పేదలకు, విలేకరులకు ఇచ్చిన భూములను బినామీ పేర్లతో సొం తం చేసుకోవడం దారుణం.

రాజకీయ, ఆరి ్థక పలుకుబడి ఉందనే ధీమాతో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నిజమైన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి. ఈ వ్యవహారంపై అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రమేష్ మా ట్లాడుతూ  గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు విచారణ కొనసాగుతోందని తెలిపారు. అక్రమాలు రుజువైతే సదరు ప్లాట్ల కేటాయింపు లను రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.