ఉద్యోగినుల విధి నిర్వహణ అభినందనీయం
08-03-2026 12:00 AM
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): మహిళాభ్యుదయం -జాతికి శుభోదయమని, ఉద్యోగినుల విధి నిర్వహణ అభినందనీయమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి కితా బిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం బస్ భవన్‌లో జరిగిన వేడుకల్లో మాట్లాడారు.
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటి చెబుతుండటం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఈడీలు పీవీ మునిశేఖర్, సీహెచ్ వెంకన్న, సీపీఎం ఉషాదేవి, సీటీఎం శ్రీదేవి, సీఈ (ఐటీ) వి.శ్రీదేవి పాల్గొన్నారు.




