4 May, 2026 | 12:28 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

భూ బాధితులతో ఆర్డీవో సమావేశం

07-03-2026 10:18 PM

రామాయంపేట: రామాయంపేట మీదుగా వెళుతున్న జాతీయ రహదారి బైపాస్ లో భూములు కోల్పోతున్న రైతులతో మెదక్ ఆర్డీవో రమాదేవి శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల నుండి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. అనంతరం పట్టణంలోని పదవ తరగతి పరీక్షల నిర్వహించి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు ఎక్కడ కూడా తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని అన్నారు.

నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అదే సంకల్పంతో సాధించిన విజయాలను మర్చిపోకుండా మరింత ఉన్నత శిఖరాలను ఇరగడానికి కృషి చేస్తూనే ఉండాలన్నారు. మహిళ సంకల్పం చాలా గొప్పదని సమాజానికి ఉపయోగపడే విధంగా తమ మేధస్సును ఉపయోగించాలని ఆదర్శంగా నిలబడి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆమె అన్నారు.