10-02-2026 12:00:00 AM
సత్తుపల్లి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): భారత్ అమెరికా సామ్రాజ్యవాదంతో చేసుకున్న విగ్రహం ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి యాడ్ మాన్యులకు లాభం చేకూర్చేలా ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోళ్లను తెచ్చింది వీటివల్ల కార్మికులు ఈఎస్‌ఐ పీఎఫ్ గ్రాడ్యుటి మరియు పెన్షన్ వంటి సామాజిక భద్రతకు దూరమవుతున్నారని, ఉద్యోగ భద్రత కరువైతున్నదని, వారు అన్నారు.
విద్యుత్ సవరణ బిల్లు వల్ల సామాన్యులకు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని స్మార్ట్ మీటర్లు క్రాస్ సబ్సిడీ రద్దుతో రైతులను పేదలకు ఉచిత మరియు సబ్సిడీ విద్యుత్ ప్రమాదన పడుతుందని రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని ఇది ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధం విద్యుత్ ఛార్జీలు మరియు కీలక విషయాలని రాష్ట్రాల అధికారులు తగ్గించి తన పట్టును పెంచుకుంటుందని విత్తన సవరణ బిల్లు వలన విత్తనాల దారులను నియంత్రించే అధికారం ప్రైవేట్ కంపెనీలు చేతుల్లోకి వెళ్లి బహుళ జాతి కంపెనీల పట్టు పెరుగుతుందని దాంతో సాగు ఖర్చు భారీగా పెరుగుతుందని వారు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఏ. వెంకన్న, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు బీరెల్లి లాజర్, గంటా శ్రీను, అమర్లపూడి శరత్, మండల కార్యదర్శి తాటి రాజు, ఒగ్గు నాగిరెడ్డి,దుంప రాఘవులు, సార కిషోర్, సున్నం రాజారావు, బొజ్జ వెంకటేశ్వరరావు, ప్రకాష్ రావు నెక్కొండ అలివేలు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.