నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు -నిజామాబాద్ ఎంపీ
బోధన్, జూలై 29 (విజయక్రాంతి): నవీపేట వద్ద కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను(Union Railway Minister Ashwini Vaishnaw) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలసి కొత్త ఆర్‌ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)తో పాటు కొత్త రైల్వే మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నవీపేట వద్ద కొత్త రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్ ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
అలాగే నవీపేట ప్రాంత అభివృద్ధికి రైల్వే ప్లవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా అత్యంత అవసరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రతిపాదనలను పరిశీలించి సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చినట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నవీపేట ప్రజలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నేపథ్యంలో కొత్త రైల్వే స్టేషన్, ఆర్‌ఓబీ మంజూరైతే రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






