29 July, 2026 | 10:55 AM

పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి

29-07-2026 10:00 AM

 హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు..

నిజాంసాగర్ జూలై 29(విజయక్రాంతి): గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు( heavy rains) నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతోంది. దీంతో మంజీరా నది జల కళను సంతరించు కుంది. నల్లవాగు(Nallavagu ) మత్తడి పొంగి పొర్లుతుండటంతో మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సారి నల్లవాగు ద్వారా నీటి ప్రవాహం మొదలైతే తమకు ఖరీఫ్ సాగుకు సాగునిటి ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు. దీనివల్ల జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం, నిజాంసాగర్, బిచుకుందా మండలాల రైతులకు మేలు చేకూరనుంది.