సీనియర్ జర్నలిస్ట్ రామ్ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్
జేఎన్‌టీయూ లో సీటు సాధించిన కుమార్తె శ్రీనిధికి ప్రత్యేక అభినందనలు
మంథని, జూలై 29విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కోలుకుంటున్న మంథనికి చెందిన సీనియర్ పాత్రికేయుడు పెండ్యాల రామ్ కుమార్‌ను మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు రామ్ కుమార్ నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొంది తిరిగి పాత్రికేయ వృత్తిలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.
జర్నలిజంలో ఆయన అనుభవం మార్గదర్శకం
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ... రామ్ కుమార్ ఎన్నో ఏళ్లుగా జర్నలిజం రంగానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన సుదీర్ఘ అనుభవం యువ పాత్రికేయులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సహచర జర్నలిస్టుల సంక్షేమానికి మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
జేఎన్‌టీయూ సీట సాధించిన కుమార్తెకు అభినందనలు
ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) లో సీటు సాధించిన రామ్ కుమార్ కుమార్తె పెండ్యాల శ్రీనిధిని ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందించారు. ఉన్నత చదువుల్లో మరింత రాణించి, భవిష్యత్తులో మంచి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, మంథని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఎగోలపు సంతోష్ గౌడ్, మంథని లక్ష్మణ్, నాంపల్లి శ్రీనివాస్, మాదేశి శ్రావణ్ కుమార్, ఎండీ సుభాన్ తదితరులు పాల్గొన్నారు.






