6 May, 2026 | 5:39 PM

Breaking News

రైతులకు రుణాలు, కొనుగోలు కేంద్రాలపై అవగాహన   •   సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు   •   కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •   రైతుల సేవకు పున:రంకితమవుతా   •  

ది ప్యారడైజ్ ఆగస్టుకు వాయిదా

13-02-2026 12:00 AM

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. టీమ్ ప్రస్తుతం నాని ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తోంది. తొలుత ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలనుకున్నారు.

నిర్మాతలు తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 21న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, ఓనమ్, మిలాద్--ఉన్--నబీ, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలు సినిమాకు వరుసగా మూడు వారాల పాటు కలిసి రానుంది.  ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; డీవోపీ: సీహెచ్ సాయి; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.