6 May, 2026 | 6:13 PM

రైతులకు రుణాలు, కొనుగోలు కేంద్రాలపై అవగాహన

06-05-2026 05:36 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి–ప్రణాళిక “రైతు వారము”లో భాగంగా మూడవ రోజు ఆసిఫాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జనకాపూర్ రైతు వేదికలో కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షుడు అలీబిన్ హైమద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు, ట్రాక్టర్ లోన్లపై అవగాహన కల్పించారు. రుణాలు తీసుకునే సమయంలో ఉన్న ఉత్సాహంతోనే తిరిగి చెల్లించాలని, అప్పుడు ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.

అలాగే రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా, దళారుల మోసాలకు గురికాకుండా సహకార సంఘాల ద్వారా కందులు, మక్కలు, జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద గిట్టుబాటు ధరకు పంటలు అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రుకుం ప్రహ్లాద్,  ఏవో మిలింద్, జిల్లా సహకార బ్యాంక్ మేనేజర్ వెంకట రవీందర్, ఎస్బిఐ మేనేజర్ తిరుపతి, సహకార సంఘం సెక్రెటరీ వెంకటరమణతో పాటు రైతులు చాపల రమేష్, వ్యాపార లక్ష్మి, కవల్కర్ శంకర్, పత్రు, రాంఠంకి శంకర్, జాలింషా తదితరులు పాల్గొన్నారు.