పాలకవర్గాల విధానాలు తిప్పికొట్టాలి
తెట్టెలపాడులో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు
తిరుమలాయపాలెం, మే 01 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెట్టెలపాడు గ్రామంలో బిఆర్‌ఎస్, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి మేడే జెండాను గ్రామ సర్పంచ్ చిర్రా నర్సమ్మ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మండల నాయకుడు బిల్లగిరి ధనుంజయ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులను హరిస్తున్న పాలకవర్గాల విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల నాయకులు, గ్రామ సర్పంచ్ చిర్రా నర్సమ్మ, ఉప సర్పంచ్ పంతంగి లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు రెడ్డి మల్ల నరేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు పగిడిపల్లి బాబు, తెలంగాణ ఉద్యమకారుడు గుంటి పుల్లయ్య, ఉప్పలయ్య, తోడేటి నాగరాజు, తోర్రికొండ నాగేశ్వరరావు, ఎర్ల ఉపేందర్, సోమనబోయిన రాజా, వంగూరి విజయ, ఈర్ల రామన్న, బిల్లగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






