10 May, 2026 | 1:43 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి

10-05-2026 12:00 AM

టీపీయూఎస్ డిమాండ్

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య కోరారు. దేశవ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలులోకి వచ్చినప్పుడు, దానికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4 మరియు 57/5 ఉత్తర్వులు అత్యంత కీలకమైనవని, వీటి ప్రకారం సీపీఎస్ అమలుకు ముందు వెలువడిన నోటిఫికేషన్ల ద్వారా నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు ఈ ప్రయోజనాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం నిరాకరించడం సరైనది కాదని శనివారం ప్రకటనలో తెలిపారు.