10 May, 2026 | 12:35 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

ప్రధాని మోదీ సభకు ప్రత్యేక రైలు

10-05-2026 12:00 AM
  1. విజయవాడ నుంచి ఉదయం 8 గంటలకు ట్రైన్ 
  2. హాజరయ్యేవారికి భోజన వసతి
  3. వివరాలు వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

మహబూబాబాద్, మే 9 (విజయక్రాంతి): సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి న రేంద్ర మోడీ పాల్గొననున్న బహిరంగ సభ కు హాజరయ్యేందుకు విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం భారతీయ జన తా పార్టీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిం ది.07505 నంబర్‌తో ప్రయాణించే ప్రత్యేక రైలు విజయవాడలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 3:10 గంటలకు చేరుతుంది.

మార్గమధ్యలో ఈ రైలు ఎర్రుపాలెం, మధి ర, బోనకాలు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.అలాగే సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం లో కూడా 07506 ప్రత్యేక రైలు మల్కాజిగిరి నుండి రాత్రి 22:15 కు బయలుదేరి విజయవాడకు సోమవారం ఉదయం ఏడు గంటలకు చేరుతుందని చెప్పారు. 22 జనరల్ సిట్టింగ్ భోగిలతోపాటు రెండు ఎస్ ఎల్ ఆర్ భోగీ లు ఉంటాయని, సభకు హాజరయ్యే వారికి రైలులో తాగునీరు, భోజన వసతి ఉంటుందని ఆయన తెలిపారు.