7 August, 2026 | 4:56 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

నాడు మాట ఇచ్చారు... నిధులు విడుదల చేశారు

17-07-2026 04:26 PM

* కలెక్టర్ రాజర్శి షా చొరవతో పాలవాగులో నూతన భవన నిర్మాణానికి నిధులు

* పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ

ఉట్నూర్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ రాజర్శిషా ఆదేశాల మేరకు సిరికొండ మండలంలోని కుంటాగూడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం పాలవాగులో ఎకోపాధ్యాయ పాఠశాల భవన నిర్మాణం  కోసం భూమి పూజ  చేశారు. కుంట కూడా  సర్పంచ్ మీరబాయి యాదవరావు  తో పాటు గ్రామస్తులు జూన్ మొదటి  వారంలో జిల్లా కలెక్టర్ ను కలిసి  పాలవాగు గ్రామంలో  బడి ఏడు పిల్లలు ఉన్నారని, ఉపాధ్యాయుడితోపాటు పక్కా భవనం మంజూరు చేయాలని విన్నవించారు.

గ్రామస్తులు, సర్పంచి విన్నపం మేరకు  జిల్లా కలెక్టర్ స్పందించి నూతన పాఠశాల భవనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంతో పాటు పాఠశాలను ప్రారంభించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. దీంతో  పాలవాగులో పాఠశాల నడవడంతో పాటు  నూతన భవన నిర్మాణానికి  నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ మంజూరు చేసిన నిధులతో పక్కా భవన నిర్మాణానికి  శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు గ్రామ పటేల్, పెద్దలతో పాటు  సిరికొండ మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ కు  కృతజ్ఞతలు తెలిపారు. భూమి పూజ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ షేక్ ఇమామ్,ఉపసర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు తోకల రాజు,చిక్రమ్ పరమేశ్వర్,మాజి జడ్పీటీసీ కుంరం చంద్రకళ -రఘురామ్, మాజి అధ్యక్షులు skఇమామ్, మాజి ఎంపీపీ అమృత్ రావు, లక్ష్మిపూర్ సర్పంచ్ దీపక్,రిమ్మ మాజి సర్పంచ్ పెందూర్ అనిల్ కుమార్,పాండు పటేల్,గంగారాం,భారీక్ రావు, ఆదివాసీ విద్యార్థి సంఘము అధ్యక్షులు మహేందర్, నాగోరావ్,సామజిక కార్యకర్త షేక్ ఆలం, కొట్నాక్ బీంరావ్, శత్రుగాన్,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.