2 July, 2026 | 5:28 AM

ఇందిరమ్మ ఇండ్ల సంఖ్యను పెంచాలి

02-07-2026 02:03 AM

ఖానాపూర్ జూలై 1 ( విజయ క్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఐటీడీఏ పుట్నూరు పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సంఖ్యలు అదనంగా పెంచాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ మంత్రులకు విన్నవించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను హైదరా బాదులో కలిసి ఖానాపూర్ నియోజకవర్గానికి అదనంగా 2000 ఇండ్లను అదనంగా మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇన్ని నిర్మించి ఇస్తామని తెలిపారు.