ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, జూలై 1 (విజయ క్రాంతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం మధురానగర్ లో 30 లక్షలతో ఆధునీకరించిన ఆర్టీసీ బస్టాండ్ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ పాలనలో ఆర్టీసీని పట్టించుకున్న వారు లేరని, గంగాధర బస్టాండ్ అధ్వానంగా ఉండేదని, కనీసం బస్సులు కూడా బస్టాండులోకి వెళ్లలేదని గుర్తు చేశారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బస్టాండ్ ఆధునికరణ కోసం కృషి చేసినట్లు పేర్కొన్నారు. బస్టాండ్ చుట్టూ సీసీ రోడ్డు, ఆధునిక మరుగుదొడ్లు, ప్రయాణికులు కూర్చోవడానికి అనవుగా కుర్చీలు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులు బస్టాండులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు మరియు ఈ విద్యాసంవత్సరం నుండి గంగాధర మండల పరిధిలో చదువుతున్న అనేక మంది విద్యార్థుల సౌకర్యార్థం బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో బస్టాండు అభివృద్ధి కి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం భూపతిరెడ్డి, డిపో మేనేజర్ విజయ మాధురి , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు ముద్దం నగేష్,
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సర్పంచ్లు వేముల భాస్కర్, రాచమల్ల రవి, లింగాల లింగయ్య, రేండ్ల శ్రీనివాస్, బీర్ల ఆనందం, చిందం ఆంజనేయులు, బారాజు ప్రభాకర్ రెడ్డి, పురమల్ల మనోహర్, మాజీ జెడ్పిటిసి సత్తు కనకయ్య, పడాల రాజన్న, కంకణాల రాజగోపాల్ రెడ్డి, గునుకొండ బాబు, వేముల అంజి, సాగి అజయ్ రావు, మేర్జ కొండయ్య, కర్ర బాపురెడ్డి, బైరిశెట్టి సంపత్, అట్ల శేఖర్ రెడ్డి, ఆరె రాజశేఖర్, గుడి ప్రవీణ్ రెడ్డి, కడారి కనకయ్య, గుండావేణి తిరుపతి, కొలిపాక మల్లేశం, పెంచాల చందు పాల్గొన్నారు.






