15 August, 2026 | 1:40 AM

ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి

15-08-2026 12:26 AM

తాడ్వాయి, ఆగష్టు,14 ( విజయ క్రాంతి ): ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలని కన్కల్ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రతినిధులతో కలిసి ఆయన విద్యార్థులకు జెండాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రతి ఇంటి మీద ఈ జెండాలు ఎగరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాఖ మహేందర్, బిజెపి మండల అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, మర్రి అనిల్, రాజు, తిరుపతిరెడ్డి, కమలాకర్ రావు, జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.