మా మూవీకొస్తే సీట్ బెల్ట్ అక్కర్లేదు!
అందచందాలతో ఆకర్షించే రాశీసింగ్ ఒక్కసారిగా ఎయిర్ హోస్టెస్ అవతారం ఎత్తింది! ప్లుటైలో సిబ్బంది ప్రయాణించేవారికి జాగ్రత్తలు చెప్పినట్టు.. రాశీసింగ్ కూడా అచ్చంగా అనౌన్స్‌మెంట్ చేసి ఆహూతులను ఆకట్టు కుంది. వడ్డే నవీన్ నిర్మాతగా, హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కు జోడీగా నటిస్తోంది రాశీసింగ్.
జూన్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లోనే రాశీసింగ్.. ఎయిర్ హోస్టెస్ అవతారం ఎత్తింది. “అందరికీ నమస్కారం. మా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా జూన్ 19న విడుదలవుతోంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. మా పైలట్ కమల్ తేజ మిమ్మల్ని ఎంటర్‌టైన్ మెంట్ జర్నీకి తీసుకెళ్తారు.
మీ ఫేవరేట్ వడ్డే నవీన్, నేను మీకు వినోదం పంచేందుకు రెడీగా ఉన్నాం. థియేటర్‌కు వెళ్లి మా సినిమా చూసేందుకు మీకు సీట్ బెల్ట్ అవసరంలేదు. ఎందుకంటే మా సినిమా ప్లాటే మీకు సీట్ బెల్ట్‌లా ఉంటది..’ అంటూ సభలో నవ్వులు పూయించింది. గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన రాశీసింగ్ ఈ వేదికపై సరదాగా తమ సినిమా వివరాలను ఓ ఎయిర్ హోస్టెస్‌లాగా తెలియజేయడం ఆకట్టుకుంది. ఇదే వేదికపై హీరో వడ్డే నవీన్, చిత్రబృందం కూడా మాట్లాడారు.






