అభివృద్ధిలో వివక్ష ఎందుకు?
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ సమావేశంలో పట్టణంలోని ఓవర్గం ప్రార్థనలకు కోటి రూపాయలు అభివృద్ధి నిధులను కేటాయించడం అన్యాయమని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, సీనియర్ నేత సాధన అరవింద్ అన్నారు. మంగళవారం నిర్మల్ మున్సిపల్ సమావేశంలో ఎజెండాలో ప్రజల సొమ్ము అయినా జనరల్ ఫండ్ ఇతర పండులను కోటి రూపాయల వరకు కొత్తగా నిర్మిస్తున్న ఈద్గా వద్ద అభివృద్ధి పనులకు కేటాయించడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పట్టణంలోని 42 వార్డులో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని కనీసం సౌకర్యాలు లేవని మురికి కాలువలు సిసి రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే నిధులను ఒక వర్గం వారికి కేటాయించడం దీన్ని బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని లేకుంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.






