30 June, 2026 | 6:19 PM

రాజంపేటలో నూతన తాగునీటి బోరింగ్ ఏర్పాటు

30-06-2026 05:26 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడి వెనుక గల్లీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన నూతన బోరింగ్‌ను గ్రామ సర్పంచ్ బుర్సా పోచయ్య, వార్డ్ మెంబర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గులాం జావిద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని వారు తెలిపారు. బోరింగ్ ఏర్పాటుతో స్థానికుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.