పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
30-06-2026 05:24 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల పరిధిలోని బనిగండ్లపాడు బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం సుదర్శన్ ఫౌండేషన్ అధినేత, పాస్టర్ జగదీష్ పాల్ ఆధ్వర్యంలో 90 మంది పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగా గురునాథరెడ్డి మాట్లాడుతూ... పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్స్ అందజేయడం అభినందనీయమని, పేద విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న జగదీష్ పాల్ సేవలను కొనియాడారు.






