పక్కగా భూ హక్కుల కోసం రీసర్వే
భూ క్రయవిక్రయాల్లో మ్యాపులను అప్డేట్ చేయాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట్ మండలంలోని బీక్యాతాండలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భూభారతి భూముల రిసర్వే గ్రామసభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్,ఆర్డీవో ఎడి సర్వే ఎంపీడీవో గ్రామ సర్పంచ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ... శివంపేట మండలం 1946 సంవత్సరంలో రిసర్వే అయిందని, అప్పటి నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. భూమి క్రయవిక్రయాల్లో మ్యాపులను కూడా అప్డేట్ చేయాలన్నారు.
గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ... శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారం కోసమే భూ రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.






