12 May, 2026 | 1:46 AM

మక్కల ట్రాక్ట ర్లతో నిండిన మార్కెట్ యార్డ్

12-05-2026 12:39 AM

మహబూబాబాద్, మే 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేస ముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డు సోమవారం పూర్తిగా మక్కల లోడ్ ట్రాక్టర్లతో నిండిపోయింది. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసిన మక్కలను మార్కెట్ యార్డు లోని షెడ్డులో నిలువ చేయడానికి అ నుమతించారు.

దీంతో  రైతులు మార్క్ ఫెడ్ సంస్థకు విక్రయించడానికి సిద్ధం చేసిన బస్తాలను ట్రాక్టర్లతో తెచ్చారు.  దీనితో మార్కెట్ యార్డ్ పూర్తిగా టాక్టర్లు బారులు తీరి నిండిపోయింది. ప్రస్తు తం వచ్చిన మొక్కజొ న్నలను దిగుమతి చేయడానికి రెండు రోజులపాటు సమయం పడుతుందని,  అప్పటివర కు మార్కెట్లోకి మక్కజొన్నలను తేకూడదని అధికారులు ప్రకటించారు.