7 August, 2026 | 4:58 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

ప్రధాని మోదీని తిడితే ఒక్క కేసైనా పెట్టారా?

05-08-2026 02:32 PM

బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా?

న్యూఢిల్లీ: హస్తినా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూషిస్తే మా ప్రభుత్వం కేసు నమోదు చేసిందని తెలిపారు. ఒక డీఎస్పీని బదిలీ చేశానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అధికారిని బదిలీ చేయడం  ప్రభుత్వానికి ఉన్న అధికారం అన్నారు. తన పరిధిలో ఉంది కాబట్టి తానే బదిలీ చేశానని చెప్పారు. బీజేపీ నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీని(Cockroach Janata Party), విద్యార్థులను అంతకంటే ఎక్కవే దూషించారని రేవంత్ ఆరోపించారు.