5 August, 2026 | 3:18 PM

ఉపాధ్యాయుడిగా మారిన సర్పంచ్

05-08-2026 02:26 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మారుమూల గ్రామమైన అంధూర్ గ్రామ పాఠశాలలో గిరిజనవిద్యార్థులు 40 మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల చదువులకు అటంకం ఏర్పడింది దీంతో సర్పంచ్ ఉపాధ్యాయుడిగా మారాడు. 

ఆఫీస్ పనులతో ఉపాధ్యాయుల సతమతం

గిరిజన ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం మనకు సంబంధించిన వివిధ రకాల పనులు అప్పజెప్పడంతో పాటు ఉపాధ్యాయులు రోజువారి రికార్డులను పరిశీలించాల్సి వస్తున్నది దీంతో విద్యార్థులచదువులకు అటంకం కలుగుతున్నది. మారుమూల గిరిజన గ్రామంలో చదువుకోవాలని ఉత్సాహంతో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత వల్ల చదువు అందకుండా పోతుందని కాబోతున్నారు..

ఉచితంగా బోధిస్తున్నాం

తమ గ్రామంలో చదువుకునేందుకు దాదాపు 40 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారని గ్రామ సర్పంచ్ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు విద్య బోధించి ఒకే ఒక్క గురువు ఉండడంతో చదువులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. దీంతో గమనించిన తాను ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నామన్నారు. గత రెండు సంవత్సరాలు సర్పంచ్ భార్య చదువు నేర్పగా ఇప్పుడేమో సర్పంచి ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు బోధన చేస్తున్నారు. ఏది ఏమైనా సర్పంచ్ తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామంలోని విద్యార్థులు చదువుకున్నోసుకుంటున్నారు.