ఆ కులాల ఎత్తుగడల్ని తిప్పికొట్టాలి
- అందుకు కాన్షీరాం మార్గమే శరణ్యం
- జగ్జీవన్‌రాంను ప్రధానిని కాకుండా అడ్డుకున్నది ఆధిపత్య కులాలే
- మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు
ఖైరతాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని డౌన్‌టౌన్ మాల్‌లోని మీడియా సెంటర్‌లో ఆదివారం బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షతన మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు ఘన నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జగ్జీవన్ రాం కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, అత్యం త సమర్థుడైన బహుజన మహానేత అని కొనియాడారు. 1977లో ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, ఆధిపత్య భూస్వామ్య కులాలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాదిగ కులస్తుడు దేశ అత్యున్నత పదవిని అధిష్టించకూడదనే ఉద్దేశంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, జనతా పార్టీలోని కొందరు నేతలు జగ్జీవన్‌ను వెనక్కి నెట్టి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్‌లకు అవకాశం కల్పించారని ఆరోపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య విషయం లోనూ వివక్ష జరిగిందని, ఆయనను అధికారంలో కొనసాగనివ్వకుండా రెడ్డి సామాజిక వర్గ నేతలు అడ్డుకున్నారని పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి హామీని కేసీఆర్ తుంగ లో తొక్కడం, ఉప ముఖ్యమంత్రి రాజయ్య ను ఆకస్మికంగా తొలగించడం వంటి ఘటనలు రాజకీయ వివక్షకు నిదర్శనమని అన్నా రు.
ఏపీలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని అగ్రవర్ణ మంత్రి చులకనగా చూడ టం దారుణమని పేర్కొన్నారు. హోమ్, ఫైనాన్స్ వంటి కీలక శాఖలు ఎప్పు డూ రెడ్డి, కమ్మ, వెలమ వర్గాల చేతుల్లోనే ఉంటాయన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సైతం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారని,
నేటికీ ముస్లిం మంత్రులకు సరైన గౌరవం లభించడం లేదని పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో హోమ్ మంత్రిని ప్రగతి భవన్లో కి రాకుండా పోలీసులు అడ్డుకోవడం వంటి సంఘటనలు బహుజన నేతల దయనీయ స్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. బహుజన వర్గాల నిజమైన సాధికారతకు స్వతంత్ర రాజకీయ పార్టీ నిర్మాణం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఆధిపత్య కులాల ఆధ్వర్యంలోని పార్టీలపై ఆధారపడకుండా, బహుజన వర్గా లు తమ స్వంత రాజకీయ వేదికలను నిర్మించుకొని, కాన్షీరామ్ ఆలోచనలతో తమ సామాజిక శక్తిని రాజకీయ అధికారంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కాన్షీరామ్ చూపిన మార్గంలో మేమెంతో మా కంత అనే నినాదంతో ముందుకెళ్లాలని ఏఐబీఎస్పీ పార్టీ ఆ దిశలో పయనిస్తుందని ఆయన అన్నారు.
బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు మాట్లాడుతూ.. అంబేద్కర్ వేసిన మేధోపరమైన పునాది, జగ్జీవన్ రామ్ రాజకీయ పోరాటం, కాన్షీరాం చూపి న రాజకీయ ఇంజనీరింగ్ మార్గమే బహుజన విముక్తికి శరణ్యమని అన్నారు. బీసీ నాయకులు మానేకర్ విజయ, నీలికుల సంఘం సెక్రటరీ, కె శ్రవణకుమార్, ఎరమల శివరాజ్, ఆర్పిఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, చిలుక శివకుమార్ , ఏఐఎస్‌సీఎస్‌టీఆర్‌పీఎస్ ట్రెజరర్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




