6 April, 2026 | 3:44 AM

కార్యకర్తలు ప్రజల మధ్యనే ఉండాలి

06-04-2026 02:03 AM
  1. తెలంగాణలో మార్పునకు నూతన దిశ

టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు!

పాదయాత్రతో ప్రజల్లోకి మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించబడింది. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుకేందుకు ప్రతి గ్రామం లో, ప్రతి వార్డులో పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. ‘జిల్లా నాయకత్వం అంతా పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీద ఫోకస్ పెట్టి త్వరగా పూర్తి చేయాలి. రాష్ట్ర కమిటీ ఈరోజు తీర్మానించినట్టు పార్టీ క్రియాశీలక సభ్యత్వం రుసుము రూ.100 చెల్లించి పార్టీలో చేరాలి.

సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం. మే నెల చివరి వారంలో పార్టీ ప్లీనరీతో పాటు హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహిస్తాం. తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థ ల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఇంది రా పార్క్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం త్వరలోనే చేపడతాం. బీసీ ఉద్యోగుల అండ గా పార్టీ తర ఫున ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తు న్నాం. ఇది సాధారణ సమావేశం కాదు, తెలంగాణలో మార్పు తీసుకురావాలనే మ న సంకల్పానికి ఇది కొత్త ఆరంభం’ అని అన్నారు. 

సమావేశంలో తీర్మానాలు

గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ నిర్మాణాన్ని విస్తరించేందుకు స్పష్టమైన వ్యూహాలు రూపొందించారు. ప్రతి గ్రామం లో కనీసం 100 మంది యాక్టివ్ కార్యకర్తలు ఉండేలా లక్ష్యాన్ని నిర్ణయించారు. యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు వంటి అన్ని వర్గాలను కలుపుకుంటూ పార్టీని విస్తరించాలని తీర్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్ ప్లాట్ఫా మ్ ద్వారా సభ్యత్వాన్ని సులభతరం చేసి లక్షలాది మందిని పార్టీకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్ర మం కోసం ప్రత్యేక కమిటీలను నియమించారు. 

మల్లన్న పాదయాత్ర  

పార్టీ అధ్యక్షుడు మల్లన్న చేపట్టబోయే ప్రతిష్టాత్మక పాదయాత్రపై సవివరంగా చర్చించారు. మొదటి పాదయాత్ర జూన్ 2వ తేదీన హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మీదుగా ప్రారంభమై వరంగల్‌లో ముగిసేలా షెడ్యూల్ చేశారు. ప్రతి కార్యకర్త తన ప్రాంతంలో ప్రజా సమస్యలను గుర్తిం చి, వాటి పరిష్కారానికి ముందుండాలని స్పష్టం చేశారు. కార్యకర్తల సామర్థ్యాలను పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. సోషల్ మీడియా, గ్రామ సభలు, ప్రజా ఉద్యమాల ద్వారా పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయాలని నిర్ణయించారు.