8 April, 2026 | 1:58 AM

విద్యుత్ లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలి

08-04-2026 12:11 AM

సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మాణిక్

కొండాపూర్, ఏప్రిల్ 7: కొండాపూర్ మండల గంగారం గ్రామ రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ మంగళవారం గ్రామంలో రైతుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గంగారం గ్రామంలో రైతులకు లో వోల్టేజ్ విద్యుత్ సరఫరా వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.

లో వోల్టేజ్ వల్ల రైతుల బోర్లు స్టాటర్లు తరచుగా కాలిపోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొండాపూర్ విద్యుత్ అధికారి స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. రుణమాఫీ కానీ రైతుల రుణాలు వెంటనే మాకు చేయాలి, రైతులకు నష్టం చేసి విత్తన చట్టాన్ని రద్దు చేయాలి, రైతులకు సబ్సిడీ యంత్రాలు, ఎరువులను ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయాలని అన్నారు.

కాగా గంగారం గ్రామ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది.గ్రామ రైతు సంఘం అధ్యక్షులుగా బక్క రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, 11 మంది సభ్యులతో గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో  తెలంగాణ రైతు సంఘం జిల్లా  అధ్యక్షులు రాజయ్య, సిఐటియు నాయకులు బాబురావు, ప్రవీణ్, డివైఎఫ్‌ఐ నాయకులు ప్రశాంత్, రైతులు భద్రయ్య స్వామి, మొగులాన్, గంగమ్మ, సంపత్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.