8 April, 2026 | 1:59 AM

రైతుల పక్షాన పోరాటం బీఆర్‌ఎస్ బాధ్యత

08-04-2026 12:13 AM

బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు ఆ ప్రజాస్వామికం 

కొడంగల్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): రైతుల పక్షాన పోరాటం బీఆర్‌ఎస్ పార్టీ కి బాధ్యత ఉందని వారికి అండగా ఉండేందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని కోడంగల్ బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు. పరిగిలోని కాళ్లాపూర్ ను పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు వెళ్లకుండా టిఆర్‌ఎస్ నేతలను మంగళవారం కొడంగల్ పోలీసులు నిర్బంధించారు.

మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సీనియర్ నాయకుడు మధు యాదవ్ మల్లేష్ యాదవ్ దొడ్ల రవి మరియు గొల్ల రాజును పోలీసులు ముందు అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని ప్రభుత్వం అక్రమంగా రైతుల భూములను లాక్కునేందుకు  యత్నిస్తుంటే రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా అని నిలదీశారు.

భూ సేకరణ పేరుతో ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు తమ భూముల కొరకు పోరాడుతున్నా రైతులకు భరోసా ఇవ్వడం ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు అక్రమ నిర్బంధం దుర్మార్గమని విమర్శించారు. కాంగ్రెస్ నేతల రైతుల భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు.