7 May, 2026 | 2:51 AM

లోకూర్ కమిషన్ రిపోర్ట్‌ను పబ్లిక్‌లో పెట్టాలి

07-05-2026 01:58 AM

సీబీఐకి అప్పగించడమంటే ప్రజలను మోసం చేయడమే

టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట మే 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ చత్తీస్‌ఘడ్ పవర్ కొనుగోలు విషయంలో జస్టిస్ లోకూర్ కమిషన్ రిపోర్టును పబ్లిక్‌లో పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం ప్రజలను మోసం చేయడమేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ అన్నారు.

బుధవారం స్థానిక తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సొమ్ముతో పన్నుల రూపంలో వచ్చిన నిధులను పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు పవర్ కొనుగోలుకు ఖర్చు చేశారని ఈ విషయంలో అనుమానాలు రావడంతో లోకూర్ కమిషన్ వేసినట్లు తెలిపారు. ఈ కమిషన్ అనేక అనుమానాలను వెల్లడించిందని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కలసి చేస్తున్న దోపిడీ బయటపడకుండా రిపోర్టును బహిర్గతం చేయకుండా సీబీఐకి అప్పగిస్తుందన్నారు.

లోకూర్ కమిషన్ రిపోర్టును పబ్లిక్ లో పెట్టాలని నాడు ఒక మెగావాట్ కొనుగోలుకు ౬.౭౫ కోట్లు కాగా 10 కోట్లకు పెంచారని,  ప్లాంట్ రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉండగా ఏడు సంవత్సరాల సమయం పట్టిందన్నారు. బొగ్గు గనులకు దగ్గరగా పవర్ ప్లాంట్ ను ఏర్పా టు చేయాల్సి ఉండగా దూరంగా ఏర్పాటు చేయడంతో రవాణా ఖర్చులు రూ.800 కోట్లు సంవత్సరానికి అవుతున్నాయన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసిన కరెంటు వాడకుండానే రూ.630 కోట్లు ఎలా చెల్లించాని కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు.

కారకులైన వారిని శిక్షిం చకుండా రిపోర్టును సీబీఐకి అప్పగిస్తూ రాజకీయ అండర్‌స్టాడింగ్ తో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత 2014లో ఆయనకు ఉన్న ఆస్తులు ఇటీవల ఆయన సమర్పించిన అఫిడవిట్లో పెరిగిన ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య తదితలు పాల్గొన్నారు.