15 June, 2026 | 2:29 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

పరమపద సోపానం వచ్చేది అప్పుడే

10-04-2026 01:23 AM

‘అర్ధనారి’, ’తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి హీరోగా రూపొందిన కొత్త సినిమా ‘పరమపద సోపానం’. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. స్వయంభూ క్రియేషన్స్ పతాకంపై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్నాంజనేయులు సంయుక్తంగా నిర్మించారు.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగశివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరో అర్జున్ అంబటి లుక్ ఇంటెన్స్ ఫీల్ కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: డేవ్ జాండ్; డీవోపీ: ఈశ్వర్; నిర్మాతలు: గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్నాంజనేయులు; దర్శకత్వం: నాగశివ.