15 June, 2026 | 3:16 PM

Breaking News

తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •  

భావోద్వేగాల డైమండ్ డెకాయిట్

10-04-2026 01:24 AM

తెలుగులో రూపొందిన కొత్త చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. ఇందులో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించారు. మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు. సూర్య జీ యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంగీతం: పీఆర్; సినిమాటోగ్రఫీ: శివ అచంట; ఎడిటర్: శివ సర్వాణి. ఈ చిత్రం ఏప్రిల్ 10న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేసింది. ఈ ప్రెస్‌మీట్‌లో హీరో, నిర్మాత పార్ధా గోపాల్ మాట్లాడుతూ.. “డైమండ్ డెకాయిట్’ ప్రతి కు టుంబం కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నాం” అని చెప్పారు. దర్శకుడు సూర్య జీ యాదవ్ మాట్లాడుతూ.. “33 ఏళ్ల క్రితం వచ్చి న మాతృదేవోభవ సినిమా తరహా భావోద్వేగాన్ని ఈతరం ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ‘డైమండ్ డెకాయిట్‌” అని తెలిపారు.